యువత స్వయం ఉపాధిలో రాణించాలి..

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండల కేంద్రంలో వెల్ది గ్రామానికి చెందిన పెంతల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీఎస్ఆర్ కారు డ్రైవింగ్ స్కూల్ ను రఘునాథపల్లి ఎస్ఐ డి. నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. డ్రైవింగ్ వంటి నైపుణ్యాలు ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

పీఎస్ఆర్ కారు డ్రైవింగ్ స్కూల్ ద్వారా యువతకు నాణ్యమైన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వై. కుమార్ గౌడ్, వెల్ది గ్రామ మాజీ సర్పంచ్ కొయ్యడ మల్లేష్, మార్కెట్ మాజీ డైరెక్టర్ నూనెముంతల యాకస్వామి, రంగు శ్రీనివాస్ గౌడ్, బండి కుమార్, యుగంధర్, కల్పగూరి రాజు, బాలబోయిన శ్రీనివాస్, ఎడ్ల అశోక్, కీర్తి వెంకటేష్, కుమార్, యువకులు తదితరులు పాల్గొన్నారు.