మండల కేంద్రంలో యోగాకు పెరుగుతున్న ఆదరణ
మండల కేంద్రంలో యోగాకు పెరుగుతున్న ఆదరణ
- ఉచిత యోగ శిభిరం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో యోగా పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యువకులు, పెద్దలు ఉత్సాహంగా యోగాలో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించే యోగా శిబిరం స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నారు.
ముఖ్యంగా యువత యోగా ద్వారా ఫిట్‌నెస్ సాధించడానికి ముందుకు వస్తుండగా, పెద్దలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకునేందుకు యోగాను అలవాటు చేసుకుంటున్నారు. యోగాతో ఒత్తిడి తగ్గి శరీరానికి, మనసుకు ప్రశాంతత లభిస్తుందని పాల్గొనేవారు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం ఉచిత యోగ శిబిరంలో పాల్గొని ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలని నిర్వహకులు తెలిపారు.
