విద్యార్థులకు ఎమ్మెల్యే జీ ఎస్సార్ సూచనలు..

గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచన

రేగొండ, ఆంధ్రప్రభ: భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం లింగాల ఎంజేపీ గురుకుల పాఠశాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి భోజనం రుచిగా ఉందా, మెనూ ప్రకారం వసతులు కల్పిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.

తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రోజువారీ మెనూ గురించి తెలుసుకుంటూ, పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, విద్యా ప్రమాణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, తహసీల్దార్ శ్వేతారావు, పాఠశాల ఇంచార్జి స్వప్న, ఉపాధ్యాయులు, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి విజ్జన్‌రావు, నాయకులు మేకల భిక్షపతి, ఇప్పకాయల నర్సయ్య, పున్నం రవి, కోలేపాక సాంబయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, గుగులోతు వీరునాయక్, క్యాతం సదయ్య, గుల్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.