బక్రీద్ పండుగపై పోలీసుల సూచనలు

బక్రీద్ పండుగపై పోలీసుల సూచనలు
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు పవిత్ర బక్రీద్ (ఈద్-ఉల్-అధా) పండుగను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పెనుగంచిప్రోలు ఎస్సై అర్జున్ ముస్లిం నాయకులకు సూచించారు.
పోలీస్ స్టేషన్‌లో ముస్లిం పెద్దలు, మసీదు కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గోవధతో పాటు ఇతర నిషేధిత జంతువుల వధ పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పండుగ రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పండుగ సందర్భంగా సమస్యలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సమావేశంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
