ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బిళ్లకంటి హరిబాబు విజయం

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బిళ్లకంటి హరిబాబు విజయం

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా బిళ్లకంటి హరిబాబు ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి వాస రమేష్‌బాబుపై 133 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఆదివారం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జిల్లా కన్వీనర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆర్యవైశ్య మహిళలు, యువత, పెద్దలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.

మొత్తం 2,200కు పైగా ఓటర్లు ఉండగా, 1,177 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 6:49 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై, రాత్రి 8 గంటల ప్రాంతంలో పూర్తయింది.ఓట్ల లెక్కింపు అనంతరం బిళ్లకంటి హరిబాబు 133 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు జిల్లా కన్వీనర్ శివకుమార్ ప్రకటించారు.

ఎన్నికల నేపథ్యంలో ఇరువురు అభ్యర్థులు పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేపట్టి సంఘ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు.

Leave a Reply