వైభవంగా ముగిసిన శ్రీ ఆందోల్ మైసమ్మ బోనాల మహోత్సవాలు

మూడు రోజుల జాతరకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయంలో 21వ బోనాల ఉత్సవాలు సోమవారం వైభవంగా ముగిశాయి. ఈ నెల 1న ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.

ముగింపు ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక గణపతి పూజ, పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి సల్వాది మోహన్ బాబు మాట్లాడుతూ, ఈ ఏడాది బోనాల ఉత్సవాలను భక్తుల సహకారంతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, గ్రామస్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం చైర్మన్ కంచర్ల అశ్విన్ రెడ్డి, సంతోషిమాత దేవాలయ ఈవో అలుగుబెల్లి సత్తిరెడ్డి, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్, ధర్మకర్తల మండలి సభ్యులు ఈడుదుల బాబు, బేతాళ నరసింహ, సిద్దిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్ గౌడ్, బొంతల యువరాజ్, మన్నే మహేందర్ రెడ్డి, దౌడీ రాజేష్ పన్నాల, మహేందర్ రెడ్డి, ధేప రాజీవ్, పంతంగి రమేష్, జొన్నగంటి దాసు, చిట్టెంపల్లి సబిత, అర్చకులు వల్లూరి శివప్రసాద్ శర్మతో పాటు గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.