పైప్ లైన్ పనులకు భూమి పూజ..

సిర్పూర్(యు), ఆంధ్రప్రభ ; ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకారంతో పైప్ లైన్ నిర్మాణ పనులకు మంజూరైన నిధులతో పనులు చేపట్టడానికి శుక్రవారం మహాగామ్ పంచాయితీ కేంద్రంలో సర్పంచ్ సెడమకి జానే రావు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైప్ లైన్ నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకారంతో నిధులు మంజూరు కావడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో దనోరా సర్పంచ్ మెస్రం స్పందన భూపతి, మహాగా0 ఉపసర్పంచ్ ఆత్రం భీమ్రావు, వార్డు సభ్యులు మెస్రం శ్రీరామ్, మడావి దురునాథ్, మహాగం రాయి సెంటర్ సర్మిడి ఆత్రం ఆనంద్ రావు, పీఠాధిపతి మెస్రం కైలాస్ తదితరులు పాల్గొన్నారు.
