చనుబండ పీహెచ్‌సీ భవనానికి శంకుస్థాపన..

  • రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి చేతుల మీదుగా భూమిపూజ

ఏలూరు/చాట్రాయి, ఆంధ్రప్రభ : చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సంయుక్తంగా రూ.1.93 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) భవనానికి భూమిపూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం నూతన విలేజ్ హెల్త్ క్లినిక్ భవన తాళాలను వైద్యాధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్, నూజివీడు నియోజకవర్గ పరిశీలకుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. యు. శోభ, డీసీహెచ్‌ఎస్ డా. సి.హెచ్. బేబీకమల, ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కో-ఆర్డినేటర్ డా. రాజీవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.