Breaking | స్టాలిన్‌కు ఊరట..
చెన్నై, ఆంధ్రప్రభ : ఉదయ్‌నిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. సీఎం విజయ్, త్రిషలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో అరెస్టైన ఉదయ్‌నిధిని విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
విచారణ అనంతరం ఉదయ్‌నిధిని విడుదల చేస్తామని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. అదే సమయంలో విచారణకు పూర్తిగా సహకరించాలని మద్రాస్ హైకోర్టు ఉదయ్‌నిధికి సూచించింది. విజయ్, త్రిషపై ఉదయ్‌నిధి చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
