24aprilcartoonstory |ట్రంప్ విధానాలతో అమెరికా కల కరిగిందా?

24aprilcartoonstory |ట్రంప్ విధానాలతో అమెరికా కల కరిగిందా?

24aprilcartoonstory | అమెరికా కల.. భారతీయుల వలసల వెనుక నిజాలు
ట్రంప్ విధానాల దెబ్బ.. వలసదారుల్లో పెరుగుతున్న ఆందోళన
స్వదేశానికి తిరుగు ప్రయాణం.. కుటుంబాలకు కొత్త ఆశ
బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ గెయిన్ దిశగా భారత్

24aprilcartoonstory | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏ దేశమేగినా….ఎందుకాలిడినా…పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు మన భారతీయులు ఖండ ఖండాతరాలకూ విస్తరించి జన్మభూమికి పేరు ప్రఖ్యాతులు తేవడం గొప్ప విషయం. అయితే..అదే సమయంలో వారి మేధో సంపత్తి మన దేశానికి కాకుండా పరాయి దేశాలకు ఉపయోగపడడం, వలసల వల్ల మన దేశానికి కొంత నష్టమే. అలాగని ప్రతిభావంతులు అవకాశాలను వెతుక్కుంటూ, అందిపుచ్చుకుంటూ వెళ్ళే వారి హక్కుని ఎవ్వరూ కాదనలేరు కదా. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికీ, అక్కడ స్థిరపడాలనుకునే వారికీ అమెరికా భూతల స్వర్గం. ఒక్కసారి అక్కడ స్థిరపడిన వారికి ఇక అక్కణ్ణుంచి తిరిగి రాబుద్ధి కాదు. తరాలు గడిచినా తిరిగి చూడాలనిపించదు. అది కన్నవారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. వీడియో కాల్స్ లో ఎంత మాట్లాడినా, కన్నవాళ్ళనూ, వారి పిల్లలనూ దగ్గరికి తీసుకున్నంత ఆనందం, స్పర్శలోని సాంత్వన వీడియో కాల్స్ తీరుస్తాయా? అసలు కొంతమందైతే ఇక్కడున్న తల్లిదండ్రులతో మాట్లాడేంత సమయమే కేటాయించలేరు. అక్కడి బిజీ లైఫ్ అలాంటిది మరి. అయినా అక్కణ్ణుంచి రావడానికి మారి మనసొప్పదు.

కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల పరిస్థితులు మారిపోయాయి. వలసదారుల వేళ్ళను సైతం పెకిలిస్తున్న దూకుడు అక్కడ స్థిరపడిన వారికి కంగారు పుట్టిస్తోంది. గుండెల్లో దడ పుట్టిస్తోంది. “అమెరికా ఫర్ అమెరికన్స్” అని పదే పదే చెబుతున్న ట్రంప్ మాటల్లోనే కాదు, చేతల్లోనూ తగ్గట్లేదు. ఇక విసిగి వేసారిన మనోళ్ళకు అక్కడ ఉండబుద్ధి కాక జన్మభూమి, కన్నవాళ్ళు గుర్తొస్తున్నారట…ఇక్కడలేం మహాప్రభో మా దేశానికి మేం వెళ్ళిపోతాం అని గగ్గోలు పెడుతున్నారట. ఇలా స్వదేశానికి రావాలనుకుంటున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. దాదాపు 40% మంది అనుకుంటున్నారట. పదేపదే కాల్ చేసినా పలకని తమ పిల్లలు, తమంతట తామే కాల్ చేసి కన్నవాళ్ళ దగ్గరకు వచ్చేస్తామంటే ఎలా ఉంటుంది ఆ పెద్దవారికి..!

24aprilcartoonstory
24aprilcartoonstory

ఇది కూడా ఒకరకంగా శుభ పరిణామమే కావచ్చు. వలసపోయిన మన మేధోసంపత్తి తిరిగి మన దేశానికే ఉపయోగపడవచ్చు. మనవాళ్ళు సంపాదించిన సొమ్మంతా తిరిగి పెట్టుబడుల రూపంలో మన దేశంలోనే చెలామణీ కావచ్చు…వాళ్ళ వల్ల కొత్త పరిశ్రమలు రావచ్చు…కొంతమందికి ఉపాధి దొరకొచ్చు….మంచిదే కదా….

-మాధవ్

click here for madhav cartoons

click here to enjoy OURA cartoons

Leave a Reply