పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్‌ఎస్ నేతల ఘన నివాళి

తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు చిరస్మరణీయం: ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను, పార్టీ బలోపేతానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి కూడా తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ మరింత బలోపేతం కావాలని నాయకులు ఆకాంక్షించారు.