రేపే టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్‌-2026 ఫలితాలు ఆగస్టు 5న విడుదల కానున్నాయి. కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలను బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నట్లు సీపీగెట్‌ కన్వీనర్‌ కట్ల రాజేందర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్‌.కె. ప్రతాప్‌రెడ్డి హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. ఫలితాల అనంతరం పీజీ ప్రవేశాల తదుపరి ప్రక్రియకు సంబంధించి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.