రైతులు ఆందోళన చెందొద్దు..

రైతులు ఆందోళన చెందొద్దు..
- రైతులతో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్….
ఇచ్చోడ, ఆంధ్రప్రభ : నెరడిగొండ మండల కేంద్రంలో గల జొన్న, మొక్కజొన్న కొనుగోలు జిన్నింగులను శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. అకాల వర్షంతో పంటను కాపాడుకోలేక ఆందోళన చెందుతున్న రైతులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కలిశారు. ఈ సందర్భంగా లారీలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు తక్షణమే 10 లారీలు వచ్చేలా ఓనర్లతో ఎమ్మెల్యే మాట్లాడి లారీలను కేటాయించారు.
రైతులు అధ్యర్యపడొద్దని కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రతీ రైతుకు అండగా ఉన్నారని ఎవరు అధ్యర్యపడొద్దని రైతుల కోసం మేము కొట్లాడుతామని భరోసా కల్పించారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు కొనే పరిస్థితిలో లేదని, రైతు బంధు ఇవ్వకపోగా ఎంతో కష్టంతో రైతులు పండించిన పంటలను వర్షంలో నీటి పాలు చెస్టసున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రు , స్థానిక ఎంపిడిఓ , సర్పంచ్ నీలిమ రవీందర్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, శివారెడ్డి, ప్రతాప్, సుజీల్, స్వామి, శ్రీధర్ రెడ్డి, రాజేందర్ తదితరులు ఉన్నారు…
