నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి: అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు.

మంగళవారం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

కాలుష్య నివారణకు ప్రజలు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. నాటిన మొక్కలు పెరిగే వరకు ప్రత్యేక శ్రద్ధతో వాటిని కాపాడుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక, వైస్ చైర్మన్ సోయాబ్ హుస్సేన్, కౌన్సిలర్లు బొప్పారపు సత్యావతి, తొడసం ఇందిరా, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.