గంజాయితో పట్టుబడ్డ నలుగురు యువకులు

గంజాయితో పట్టుబడ్డ నలుగురు యువకులు

చెన్నూర్, ఆంధ్రప్రభ: చెన్నూర్ పట్టణంలోని పెద్ద చెరువు ప్రాంతంలో స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారని సీఐ బన్సీలాల్ తెలిపారు.

అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టి తనిఖీ చేయగా వారి వద్ద 160 గ్రాముల గంజాయి లభించినట్లు వెల్లడించారు. గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్, రూ.1,500 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.