గురుకుల పాఠశాలలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

గురుకుల పాఠశాలలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర లిటిల్ హన్స్ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని పాఠశాల ఇన్‌ఛార్జ్ ఎర్ర సురేష్ తెలిపారు.

పాఠశాల విద్యార్థి గట్ల జస్వంత్ నర్మల్ జిల్లా నర్సాపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలకు ఎంపికయ్యాడు. అలాగే మరో విద్యార్థి లింగంపల్లి అలీన్ విన్సెంట్ ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా సిర్పూర్ టీలోని టీజీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలుర గురుకుల పాఠశాలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.

Leave a Reply