Gods | ఓటర్ దేవుళ్ళు నమస్కారం…

Gods | ఓటర్ దేవుళ్ళు నమస్కారం…

  • అభివృద్ధికి ఓటు ఆయుధం కావాలి
  • నాయకుడను కాను సేవకుడనై
  • మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి

Gods | మంచిర్యాల, ఆంధ్రప్రభ : ఓటరు దేవుళ్ళు నమస్కారం పాత మంచిర్యాల అభివృద్ధికి మీ ఆశీస్సులు అందిస్తూ తూముల నరేష్ మీ బిడ్డను 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ముందు గ్రామ దేవత దేవుళ్లను ప్రసన్నం చేసుకుని.మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి,మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అమ్మ నేతృత్వంలో తూముల నరేష్ జమున దంపతులు సోమవారం ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అమ్మ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూసల ఉంటూ ప్రజా ప్రభుత్వంలో మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొంది వెల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను జరిగిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం తూముల నరేష్ మాట్లాడుతూ 14 డివిజన్ పాత మంచిర్యాల డివిజన్ లో ప్రచారం చేసేందుకు తల్లి తర్వాత తల్లి అయినా సురేఖమ్మ రావడం చాలా సంతోషంగా ఉందని. 14వ డివిజన్ ఓటర్ దేవుళ్ళు అందరు నా కుటుంబ సభ్యులని నిరంతరం వారి సంక్షేమం కొరకు పాటు పడేందుకు ఒక నాయకునిగా కాకుండా, మీ సేవకునిగా నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మీ బిడ్డను నిండు మనసుతో ఆశీర్వదిస్తూ మీ అమూల్యమైన ఓటు ద్వారా అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ అమ్మాలకు పాత మంచిర్యాల ప్రజల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. నాయకుడను కాదు సేవకునిగా మీ ఇంటి బిడ్డలను ఆశీర్వదించండి అని నరేష్ దంపతులు కుటుంబ సభ్యులు,బంధువులు,పార్టీ కార్యకర్తలతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

Leave a Reply