అంతరిక్షం వెళ్లినా.. రేవంత్ బుద్ధి మారదు..

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి హరిష్ రావు మండిపడ్డారు. దేశానికి గాంధీజీ జాతిపిత అయినట్టే, తెలంగాణ సాధించిన కేసీఆర్ కుడా జాతిపిత అవుతారని రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా వెళ్లినా అంతరిక్షానికి వెళ్లినా రేవంత్ బుద్దిమారదని హరీష్ రావు ఆరోపించారు.
