ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి..
ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలి..
ఆదిలాబాద్ ఎంపీ నగేష్
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మొర్రిగూడ,కిష్టాపూర్, రోటిగూడ గ్రామాలలో ఆదివారం ఎంపీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడిదేనన్నారు.

తమ ప్రభుత్వం కేంద్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై పలువురు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు.మొర్రిగూడలో పలువురు బీజేపీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఎంపీని, ముఖేష్ గౌడ్, బద్రి నాయక్ లను శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్, రాష్ట్ర నేత ముఖేష్ గౌడ్, జన్నారం మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రినాయక్, కిష్టాపూర్ సర్పంచి వాసాల నరేష్, రోటిగూడ సర్పంచి గోపాల్,బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు రమేష్ గౌడ్,జి.దేవేందర్, కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు బెడద గోపాల్, నేతలు కొంతం శంకరయ్య, పవన్ కుమార్, లక్ష్మీరాజం, చందు, వీరాచారి, సంతోష్, సూర్యం తదితరులు పాల్గొన్నారు.
