Excise | గాజుల సౌమ్య దోషులను కఠినంగా శిక్షించాలి…

Excise | గాజుల సౌమ్య దోషులను కఠినంగా శిక్షించాలి…
- ప్రభుత్వం ఉద్యోగం వెంటనే ప్రకటించాలి
- పద్మశాలి ఉద్యోగ, రిటైర్డ్ ఉద్యోగుల ఘన నివాళులు
- కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఉద్యోగస్తులు
Excise | కరిమాబాద్, ఆంధ్రప్రభ : ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య సంతాప సభ హంటర్ రోడ్ లోని వరంగల్ నేత కార్యాలయంలో పద్మశాలి ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘన నివాళులు ఘటించారు. జనవరి 31 గంజాయి స్మగ్లర్ల దాడిలో వీరమరణం పొందిన పద్మశాలి ముద్దుబిడ్డ గాజుల సౌమ్య దోషులను కఠినంగా శిక్షించి వారి కుటుంబంలో ఒకరికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలని ఈగ వెంకటేశ్వర్లు అన్నారు.
సంతాప సభలో గాజుల సౌమ్య పరాక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోడం రవి ప్రకాష్, ,ప్రధాన కార్యదర్శి గుర్రం రాజమౌళి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బిట్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుండు కామేశ్వరరావు, కోడూరు రమేష్, వి పూర్ణచందర్, పెద్దూరి పెద్దన్న, డిం బాయ్ సీఈవో వేముల సదానందం, బత్తుల సత్యం కార్యవర్గం సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.
