భూపాలపల్లి ఆర్టీఓగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
- కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అధికారి
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణాశాఖ అధికారిగా బరగడి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లా డిటీవోగా విధులు నిర్వహిస్తున్న వెంకన్న ఈ నెల 22న జరిగిన లారీ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా రవాణాశాఖ అధికారిగా బి. శ్రీనివాస్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
