శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు…

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు…
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపూర్ (వి) గ్రామంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నాంపల్లి వీరేశం హాజరై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత చిత్రపటానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అహింస, ఆత్మ అభిమానం, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన అమ్మవారిని స్మరిస్తూ ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కులాల మహిళలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
