అమ్మవారి కృపకు పాత్రులు కావాలి

అమ్మవారి కృపకు పాత్రులు కావాలి
పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజలందరూ అమ్మవారి కృపకుపాత్రులు కావాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక 63వ డివిజన్ రాజీవ్ నగర్ రోడ్, సుందరయ్య నగర్లోని విశ్వమాత మరకత శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని ప్రార్థిస్తూ, ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దరిశి వాసు, వి.వి.కే నరసింహారావు, పైడిమర్రి రామారావు, గార్లపాటి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
పాయకాపురంలో… స్థానిక62వ డివిజన్ పాయకాపురంలో శ్రీగాయత్రి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారు నిర్వహించిన జగద్గురు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహేంద్ర స్వాములవారి 333వ ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్వామికి పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
