కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి ఖండన..
మోత్కూర్, ఆంధ్రప్రభ ; ఉద్యమ నాయకుడు,తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బి ఆర్ ఎస్ మున్సిపల్ అధ్యక్షులు జంగ శ్రీను అన్నారు.శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ, సీఎం రేవంత్ రాష్ట్రాన్ని పూర్తిగా గూండాల రాజ్యంగా మార్చేశారని ఎద్దేవా చేశారు.
ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు.పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి, కాంగ్రెస్‌కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. దాడులకు పాల్పడుతున్న మూకలను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ సన్నాసుల్లారా! మీ చిల్లర దాడులకు బీఆర్ఎస్ ఏమాత్రం భయపడదని, గ్రామ సభల్లో ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారన్నారు.కాంగ్రెస్ గూండాలను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొంటామని, ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు.
