Shivansh | 9నెలల బాలుడిని గొడ్డలితో…

Shivansh | 9నెలల బాలుడిని గొడ్డలితో…
Shivansh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవపడిన శంభుద్యాల్ కోరి అనే వ్యక్తి తన 9 నెలల కుమారుడు శివాంశ్‌ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా తెలుస్తోంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసికందు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో పడి ఉన్న గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితుడైన శంభుద్యాల్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుస్తుందని చెప్పారు. వైద్య పరీక్షల తర్వాత దీనిని నిర్ధారిస్తామన్నారు.
