పెదగాని యాదయ్య స్మారక స్థూపం ఆవిష్కరణ….

పెదగాని యాదయ్య స్మారక స్థూపం ఆవిష్కరణ….
గట్టుప్పల, ఆంధ్రప్రభ : సీపీఐ నాయకుడు పెద్దగాని యాదయ్య జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. సామాజిక న్యాయం, కార్మిక హక్కుల కోసం వారు చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తీర్పారి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి బీమనపల్లి రమేష్, రైతు సంఘం జిల్లా కోశాధికారి కంపే దుర్గయ్య, మండల నాయకులు రాపోలు సత్తయ్య, వర్కాల యాదగిరి, సిపిఐ గ్రామ కార్యదర్శి కారింగు శ్రీను, కందాల ముత్యం, దెందే నరసింహ,వారి కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
