Chairman | వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు..
Chairman | వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు..
Chairman | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ కోట పద్మావతి వరప్రసాద్ తెలిపారు. మంగళవారం ఉదయం 4 గంటల నుండి ఆలయ ఉత్తర ద్వారం నుండి స్వామి వారిని భక్తులు దర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. కావున భక్తులు క్రమ పద్ధతిలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
