శిలాఫలకాలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం…

శిలాఫలకాలపై ఎమ్మెల్యే కీలక నిర్ణయం…

అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రత్యేక కార్యక్రమాలకు మినహా ప్రతి కార్యక్రమానికి శిలాఫలకాలు వేసే సంప్రదాయానికి స్వస్థి పలకాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో అధికారులకు సూచించారు. శంకుస్దాపనలను భూమి పూజ ద్వారాను, ప్రారంభోత్సవాలను రిబ్బన్ కటింగులతో ముగించాలని అధికారులకు సూచించారు.

తాము ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నాము గానీ శిలాఫలకాలపై పేర్ల కోసం కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా శిలాఫలకాలకు వెచ్చించే ఖర్చును తగ్గించినట్లు అవుతుందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.

Leave a Reply