శరత్ బాబుకు సమాచార భారతి విశిష్ట పురస్కారం

శరత్ బాబుకు సమాచార భారతి విశిష్ట పురస్కారం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : విశిష్ట పాత్రికేయులకు సమాచార భారతి అందించే సేవా పురస్కారం శ్రీకాకుళం రచయిత జంధ్యాల శరత్ బాబుకు లభించింది. తొలి పాత్రికేయుడు దేవర్షి నారద జయంతి వేళ, ఈ అవార్డును భాగ్యనగరంలో మే 2 న బహూకరిస్తారు. బహుమతి ప్రదాన కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతినిధి విజయ భారతి ప్రధాన అతిథి.
ఆచార్య జి. గోపాలరెడ్డి (సమాచార భారతి, తెలంగాణ) అధ్యక్షత వహిస్తారు. బాధ్యతాయుత సమాచార వ్యవస్థ ధ్యేయంగా రచనలు చేస్తున్న శరత్ బాబును కాలమ్ రైటర్ విభాగంలో ఎంపిక చేశామని కార్యవర్గం ప్రకటించింది
