విజయ ఢంకా మోగించిన గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు..

విజయ ఢంకా మోగించిన గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు..

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం లో విద్యా సేవరత్న నల్లాని సూర్యారావు ఆధ్వర్యంలో నడిచే గౌతమ్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభుత్వ ఎస్.ఎస్.సీ 25-26 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు ఫలితాల్లో విజయ ఢంకా మోగించారు. ఈసందర్భంగా డైరెక్టర్ సూర్యారావు మాట్లాడుతు 100 శాతం తమ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు అని అందులో 98 శాతం ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు అని తెలిపారు.

తమ విద్యా సంస్థల లో చదవిన గుండు శివ కార్తిక్ 581 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచాడు అని అన్నారు. శివ కార్తిక్ తండ్రి లేనప్పటికీ తల్లి ఎంతో కష్టపడి చదివించింది‌. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్తిక్ స్కూల్ టాపర్ గా నిలిచాడు అని అన్నారు. అలాగే కె. ప్రణీత్ 574 మార్కులతో స్కూల్ లో ద్వితీయ స్థానంలో నిలిచాడు అని అన్నారు. ప్రణీత్ తండ్రి దినసరి కూలీ పనులు చేస్తూ తన కొడుకు ను చదివించారు. ప్రణీత్ తండ్రి కష్టాన్ని గుర్తించి మంచి మార్కులు సాధించాడని అన్నారు. రమణి అఖల్ కుమార్ 570 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచాడు అని అన్నారు.

ఇతని తండ్రి వడ్రంగి పనులు చేస్తూ చదివించారు. అఖిల్ తన తండ్రి కష్టాన్ని గుర్తించి కష్టపడి చదివి స్కూల్ లో మంచి మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచాడు అని అన్నారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి అని తాము పడ్డ కష్టం తమ పిల్లలకు ఉండకూడదనే భావనతో తల్లిదండ్రులు గౌతమ్ విద్యా సంస్థలో జేర్పించారు. వారి శ్రమను గుర్తించి తమ విద్యా సంస్థలో పని చేసే ఉపాధ్యాయులు అందరు వారి కి మంచి శిక్షణ ఇచ్చారు అని అన్నారు.

తమ విద్యా సంస్థలో విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాకుండా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, చెస్ వంటి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు అని తెలిపారు. ఈసందర్భంగా గౌతమ్ విద్యా సంస్థ ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేసి ముగ్గురు విద్యార్థులతో పాటు ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపాల్ పి.తులసీ, వైస్ ప్రిన్సిపాల్ ఎల్ శ్రీరామ్, స్కూల్ ఇంచార్జి ఉమా, రేష్మా, మధులత, శ్రీదేవి, సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply