ప్రధాన రహదారిపై గుంతలకు తాత్కాలిక మరమ్మతులు
చైర్పర్సన్ అంకం మౌనిక ప్రత్యేక చొరవ
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడడంతో మున్సిపల్ చైర్పర్సన్ అంకం మౌనిక ప్రత్యేక చొరవ తీసుకుని ఆదివారం తాత్కాలిక మరమ్మతులు చేయించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖానాపూర్ పట్టణంలోని సాయిబాబా ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఉన్న ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను సిమెంట్ కంకరతో తాత్కాలికంగా పూడ్చినట్లు తెలిపారు. వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సోయాబ్ హుస్సేన్, నాయకులు ఎనగందుల నారాయణ, ప్రకాష్ గౌడ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
