బనగానపల్లె అభివృద్ధిపై మంత్రి ఫోకస్

  • అభివృద్ధి పనులపై బీసీ జనార్దన్‌రెడ్డి పరిశీలన
  • నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

బనగానపల్లె, ఆంధ్రప్రభ : పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. బనగానపల్లె పట్టణంలోని పాత బస్టాండ్, ఆస్థానం, ఓల్డ్ రైస్ మిల్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనులు, నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి.. పనుల నాణ్యతపై అధికారులతో సమీక్షించారు.

అభివృద్ధి పనుల అమలులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.అనంతరం స్థానిక ప్రజలతో మంత్రి మమేకమై వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

బనగానపల్లె సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.