Bheemgal | బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్

Bheemgal | బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలం లింబాద్రిగుట్ట సమీపంలోని బ్రాహ్మణకుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన ముగ్గురు చిన్నారుల కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి ఓదార్పునిచ్చారు.

ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ చిన్నారుల మృతి అత్యంత విషాదకర ఘటన అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా నిలిచి సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషాదాన్ని తట్టుకుని కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు పర్స అనంతరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆరిగెల జనార్దన్, మండల ఉపాధ్యక్షుడు భూక్య రమేష్ నాయక్, చెప్పాల గణేష్, చరణ్ గౌడ్, భోజ గౌడ్, కౌన్సిలర్ సంగ్య నాయక్, మామిడి సందీప్, సర్పంచులు శ్రీరామ అరవింద్, పిండి అశోక్, దుమాల రాజు, శివ, అజయ్, ఉప సర్పంచ్ మంద గోవర్ధన్, మాజీ ఎంపీటీసీ ఏషాల కృష్ణతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.