త్రికూట ఆలయంలో కార్తీకదీపోత్సవం..
రఘునాథపల్లి, (ఆంధ్రప్రభ) : జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ గ్రామంలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఐదువందల స్థంభాల త్రికూట ఆలయ ప్రాంగణంలో కార్తీకదీపోత్సవం కన్నులపండువగా జరిగింది
గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించారు. దాదాపు ఐదు వేల దీపాలు వెలగడంతో త్రికూట ఆలయం దీపాల కాంతులతో మేళవించి అద్భుతంగా కాంతులీనింది. మహిళలు దీపాలు వెలిగించి, శివ నమస్మరణ చేస్తూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పూజారులు కృష్ణాచార్యులు, రాజేష్ భార్గవాచార్యులు, జ్యోతి కిరణ్, కర్ల జయపాల్ రెడ్డి, ఉదయ్ కిరణ్, జ్యోతి కిషోర్, ప్రశాంత్, కృష్ణ, కొంగరి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
