ప్రతికాలనీలో సీసీరోడ్లు డ్రైనేజీలు ఏర్పాటుకు కృషి

ప్రతికాలనీలో సీసీరోడ్లు డ్రైనేజీలు ఏర్పాటుకు కృషి

ఊట్కూర్,ఆంధ్రప్రభ: ఊట్కూర్ పట్టణంలోని ప్రతి కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని 9వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధులతో డ్రైనేజీ పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తానని ప్రతి కాలనీలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానని అన్నారు. ఊట్కూర్ పట్టణంలోని 16 వార్డుల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.

ఎంపీడీకే అరుణసహకారంతో పట్టణ అభివృద్ధికి నిరంతరం పాటుపడతాననిఅన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలుఅర్హులైనపేదప్రజలకు పార్టీలకు అతీతంగా అందజేస్తామని అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విస్తృతంగా చేపడుతున్నామని అన్నారు. ప్రజలు వివిధ పార్టీల నాయకులు అభివృద్ధికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపిజిల్లా వాణిజ్యసెల్ కన్వీనర్ కృష్ణయ్య గౌడ్, మాజీ ఎంపిటిసిహన్మంతు, కార్యకర్తలుబోయిని రవి, జగన్ తదితరులు పాల్గొన్నారు.