ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు..

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని గోలపల్లి గ్రామంలో మంత్రి డాక్టర్ వాకిటిశ్రీహరి ఆదేశాల మేరకు శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు వేడుకగా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత ముఖ్యఅతిథిగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశాలుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం గూడు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు.

గోలపల్లి గ్రామంలో మొదటి ప్రాధాన్యతగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 50 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది అన్నారు. అందులో ఒకే రోజు 7 ఇండ్ల గృహప్రవేశాలు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు .30 ఇండ్లు ప్రగతిలో ఉన్నాయని అవి కూడా ఈ నెల రోజుల్లో పూర్తిచేసుకుని గృహప్రవేశాలు చేసుకోవాలని ఆమె లబ్ధిదారులకు సూచించారు. 50 ఇండ్లు పూర్తి అయితే రెండవ విడత మరికొన్ని ఇండ్లు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో దాదాపు 4 వెలకు పైగా ఇండ్లను కేటాయించడం జరిగిందని త్వరలో మరిన్ని ఇండ్లు మంజూరు అవుతాయని ఆమె చెప్పారు.

లబ్ధిదారులు త్వరితగతిన తమ ఇండ్లను పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసుకోవాల్సిందిగా సూచించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలలు నిజం చేయాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రత్యేకంగా మక్తల్ నియోజకవర్గంలో స్థానిక మంత్రి రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారని గుర్తు చేశారు .అదేవిధంగా పలు సంక్షేమ పథకాలు అమలులోను రాజకీయాలకు అతీతంగా అందజేస్తూ ప్రభుత్వం ముందుకెళుతుందని చెప్పారు.

గృహప్రవేశం చేసిన ప్రతి కుటుంబానికి వాకిటివారి కానుకగా చీర సరే మంత్రి సతీమణి వాకిటి లలిత అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇల్లు నిర్మించుకుంటే దశలవారీగా బిల్లులుచెల్లిస్తుందనిఅన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణ పనుల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర్యకుమార్ ,కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా ,బి.గణేష్ కుమార్, రాజేందర్, పాల కృష్ణ, ఓబులేసు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.