పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికుమార్‌కు ఘన సన్మానం..
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికైన అలుకూరి రవికుమార్‌ను స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నాయకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మంత్రి వాకిటి శ్రీహరికి అండగా నిలుస్తూ, పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న రవికుమార్ వరుసగా మూడోసారి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణమన్నారు.
పార్టీ క్లిష్ట పరిస్థితుల్లోనూ అంకితభావంతో పనిచేసినందుకే ఆయనకు మూడోసారి అధ్యక్ష బాధ్యతలు దక్కాయని పేర్కొన్నారు. మంత్రి వాకిటి శ్రీహరితో సమన్వయంగా పనిచేస్తూ పార్టీ శ్రేణులకు రవికుమార్ మార్గదర్శకంగా నిలుస్తున్నారని కొనియాడారు.
రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యువజన కాంగ్రెస్ నాయకులుగా రవికుమార్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేణుగౌడ్, మక్తల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి భాస్కర్, మండల ఉపాధ్యక్షుడు బ్యాగరి సురేష్, సోషల్ మీడియా ఇన్చార్జి నాదెర్, నవీద్ తదితరులు పాల్గొన్నారు.
