6:00 PM | 18జూన్2026 ముఖ్యాంశాలు..

▶️ నకిలీ వాట్సాప్ ఖాతాతో కోట్ల రూపాయల మోసం : మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ ఎంపీ నరేష్ గుజ్రాల్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కాజేశారు. ఢిల్లీ పోలీసులు వేగంగా స్పందించి మోసపోయిన మొత్తంలో సుమారు 70 శాతం నగదును ఫ్రీజ్ చేయగా, నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

————————–

▶️ పెరుగుతున్న వేడి.. పర్యావరణానికి హెచ్చరిక : చెట్ల నరికివేత, పట్టణీకరణ కారణంగా భూమి ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి వ్యక్తి కనీసం రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే భావితరాలకు చల్లని వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించగలమని సూచిస్తున్నారు.

————————–

▶️ ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఈసీ ప్రత్యేక డ్రైవ్ : 24 ఏళ్ల తర్వాత ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణల్లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ప్రారంభించింది. డూప్లికేట్, చనిపోయిన వారి ఓట్లు తొలగించడంతో పాటు వివరాలు సరిపోని ఓటర్లను గుర్తించేందుకు బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు.

————————–

▶️ తెలంగాణలో జనసేన విస్తరణకు కొత్త అడుగు : హైదరాబాద్ మణికొండ సమీపంలోని మల్కంచెరువులో నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని జూన్ 19న పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది.

————————–

▶️ తిరుమలలో ఉచిత లగేజీ సేవలకు భారీ స్పందన : టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత లగేజీ, సెల్‌ఫోన్ డిపాజిట్ సేవలను ఏప్రిల్-మే నెలల్లో 51.38 లక్షల మంది భక్తులు వినియోగించుకున్నారు. తిరుమలతో పాటు కాలినడక మార్గాల్లో 66 కౌంటర్ల ద్వారా ఫేస్ రికగ్నిషన్, క్యూ ఆర్ కోడ్ సాంకేతికతతో భక్తులకు వేగవంతమైన సేవలు అందిస్తున్నారు.

————————–

▶️ టీజీఐఐసీ భూముల వేలానికి హైకోర్టు స్టే : హైదరాబాద్ రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న టీజీఐఐసీ భూముల వేలం ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు మూడు వారాల పాటు స్టే విధించింది. భూముల యాజమాన్యంపై వివాదం ఉందంటూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది.

————————–

▶️ గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతోంది : అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో కోతులు గ్రామాలు, పట్టణాల్లోకి చేరి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అటవీ శాఖ బోన్లు ఏర్పాటు చేసి కోతులను పట్టి అడవుల్లో వదులుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

————————–

▶️ టెలిగ్రామ్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగింపు : టెలిగ్రామ్‌పై కేంద్రం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలు, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ వేదికగా మారుతోందని కేంద్రం ఆరోపించగా, కోట్లాది మంది వినియోగదారులు తమపై ఆధారపడుతున్నారని సంస్థ వాదించింది.

————————–

▶️ రైతు భరోసా నిధులు జూన్ 30న విడుదల : తెలంగాణ మంత్రివర్గం వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిరలో జూన్ 30న జరిగే రైతు సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేయనుండగా, నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించాలని కూడా నిర్ణయించారు.

————————–

▶️ మకావు ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు : మకావు ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల సింగిల్స్ క్రీడాకారిణులు అన్మోల్ ఖర్బ్, రక్షిత శ్రీ రామ్‌రాజ్, శ్రీయాన్షి వాలిశెట్టి తొలి రౌండ్ విజయాలతో ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. పురుషుల సింగిల్స్‌లో రౌనక్ చౌహాన్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్-శృతి మిశ్రా జోడీ కూడా చివరి-16లోకి ప్రవేశించగా, ఆకర్షి కశ్యప్, శ్రేయా లేలే సహా పలువురు భారత ఆటగాళ్లు నిష్క్రమించారు.

5:00 PM | 18జూన్2026 ముఖ్యాంశాలు..

ALSO READ THIS