Telegram | ఢిల్లీ హైకోర్టులో విచారణ పూర్తి

Telegram | ఢిల్లీ హైకోర్టులో విచారణ పూర్తి

  • టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు

Telegram | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నీట్ యూజీ పరీక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఈ ఆంక్షలను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం విచారణను ముగించి తీర్పును రిజర్వ్ చేసింది.

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ వేదికపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, చిన్నారులపై అసభ్యకర కంటెంట్ వ్యాప్తి వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ ఛానెళ్లు, గ్రూపులు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయని కోర్టుకు తెలిపింది.

అలాగే నీట్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారానికి కూడా ఈ వేదికను వినియోగిస్తున్నారని కేంద్రం వాదించింది. మరోవైపు, కోట్లాది మంది వినియోగదారులు టెలిగ్రామ్‌పై ఆధారపడుతున్నారని, నిషేధం వల్ల తమ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని సంస్థ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.