Historic Decision | మీ ఓటు.. భద్రమేనా?
Historic Decision | మీ ఓటు.. భద్రమేనా?
Historic Decision | ఓటర్ లిస్ట్ క్లీనప్ డ్రైవ్ షురూ
24 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితాలో సవరణలు
హిస్టారికల్ డెసిషన్ తీసుకున్న ఎన్నికల కమిషన్
ఎలక్ట్రోరల్ ఎర్త్‌క్వేక్‌గా భావిస్తున్న రాజకీయ పార్టీలు
ఏపీ, తెలంగాణలో లక్షలాది ఓట్లు డేంజర్ జోన్‌లోకి
ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల ఓట్లు
గందరగోళంగా మారిపోయిన ఈసీ డేటాబేస్
అన్ మ్యాప్డ్ ఓటర్లను సమూలంగా తొలగించే చాన్స్
Historic Decision | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఓటరా? అయితే మీకో షాకింగ్ న్యూస్. 24 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇరు రాష్ట్రాల్లో ఒక హిస్టారిక్ డెసిషన్ తీసుకుంది. ఎప్పుడో 2002-2004 కాలంలో జరిగిన స్పషల్ ఇన్టెస్టివ్ రివిజన్ ప్రక్రియను మళ్లీ ఇప్పుడు 2026లో అఫీషియల్‌గా రీ-స్టార్ట్ చేసింది. అంటే మీ ఓటర్ ఐడీ కార్డు కేవలం మీ జేబులో ఉంటే సరిపోదు, ఈ సరి కొత్త సర్వేలో మీ వివరాలు మ్యాచ్ అవ్వకపోతే మీ ఓటు కాస్త.. లిస్ట్ నుంచి గల్లంతు కావడం ఖాయం. ఇది ఒక సాధారణ రొటీన్ అప్‌డేట్ కాదు. ఇదొక ఎలక్ట్రోరల్ ఎర్త్‌క్వేక్. రెండు రాష్ట్రాల్లో కలిసి లక్షలాది మంది ఓట్లపై ప్రస్తుతం సందిగ్దత నెలకొంది. దాదాపు లక్షల మంది ఓట్లు డేంజర్ జోన్‌లో పడ్డాయంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ సంఖ్యలో అన్‌మ్యాప్డ్ ఓటర్లను అధికారులు గుర్తించారు. అసలు ఈ 24 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సవరణ ఏంటీ ఎందుకు ఈ ప్రక్రియ చేపట్టింది? ఓటు కాపాడుకోవాలంటే ఏం చేయాలో చదివి తెలుసుకుందాం..
అసలు ఏంటీ ఈ సర్..
సాధారణంగా ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరిస్తుంది. దీన్ని సమ్మరీ రివిజన్ అంటారు. కానీ, రెండు దశాబ్ధాలుగా ఓటర్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం, చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండిపోవడం, ఒక వ్యక్తికి రెండు మూడు ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటం వల్ల డేటాబేస్ గందరగోళంగా మారింది. దీన్ని ప్రక్షాళన చేసేందుకు 2002లో చివరిసారిగా దేశవ్యాప్తంగా సర్ నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంత పెద్దఎత్తున సమగ్ర గ్రౌండ్ లెవెల్ సర్వే చేపడుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ఈసీ పూర్తి చేసింది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారులు సర్వే ప్రారంభించారు. ప్రస్తుతం 2026లో ఎన్నికల సంఘం 2002 ఎలక్టోరల్ రోల్‌ను కీ రిఫరెన్శ్‌గా తీసుకొని ఇప్పటి 2026 డేటాతో కంప్యూట్, మాన్యువల్ మ్యాపింగ్ చేస్తోంది.
30శాతం మిస్‌మ్యాచ్- డేంజర్ జోన్‌లో ఓట్లు
ఎన్నికల సంఘం అధికారులు ప్రాథమికంగా జరిపిన మ్యాపింగ్‌లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. 2002 జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితాను కంపేర్ చేయగా ఇరు రాష్ట్రాల్లో 30శాతం మంది మిస్ మ్యాచ్ అయ్యారు. ఒక్క తెలంగాణలోనే దాదాపు రెండు కోట్ల ఓట్లు అన్‌మ్యాపింగ్, లోపాలున్నట్టు గుర్తించారు. డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను వంద శాతం పారదర్శకంగా తొలిగించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం.
మీ ఇంటికే రానున్న బీఎల్‌వోలు..
ఈ సవరణ కోసం ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో భారీ సైన్యాన్ని రంగంలోకి దించింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 46,397 మంది.. తెలంగాణలో వేలాది మంది బూత్‌లెవల్ ఆఫీసర్స్‌ను నియమించారు. వారంతా ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. మీ వద్దకు వచ్చే బీఎల్‌వోలు ప్రత్యేకమైన యునిక్ ఎన్యూమరేన్ పామ్ తీసుకొస్తారు. ఇందులో మీ ప్రస్తుత వివరాలు ప్రింట్ అయి ఉంటాయి. ఒక వేళ మీరు మొదటి విజిట్‌లో ఇంట్లో లేకపోతే, బీఎల్‌వోలు కనీసం మూడుసార్లు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తారు. మీ 2002నాటి ఓటు వివరాలతో ప్రస్తుత వివరాలు లింక్ కాకపోతే, మీకు ఈఆర్‌వోల నుంచి అధికారికంగా నోటీసులు వస్తాయి. అప్పటికీ స్పందించకపోతే ఓటరు లిస్టు నుంచి మీ ఓటు తొలగిస్తారు.
2002లో మీ ఓటు ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి?
సర్ మ్యాపింగ్ ప్రక్రియలో అర్బన్ ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించింది. voters.eci.gov.in సిటిజన్ సర్వీస్ పోర్టల్ ద్వారా మీ పాత రికార్డులను వెతకవచ్చు. ఇంటర్నెట్ బ్రౌజర్‌లో https://voters.eci.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. హోంపేజీలో కనిపించే search your name in last SIR అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. రాష్ట్రం, జిల్లా, 2002లో ఏ నియోజకవర్గంలో ఉన్నారో వివరాలను ఎంటర్ చేయాలి. పేరు, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం నంబరు వంటి వివరాలు ఏరియా బీఎల్‌వోకి అందిస్తే మ్యాపింగ్ విజయవంతం అవుతుంది. ఈ ప్రక్రియ షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. జూన్ 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సుదీర్ఘ ప్రక్రియ అక్టోబర్ నాటికి ముగిసి, సరికొత్త ప్యూరిఫైడ్ ఓట్ లిస్ట్ బయటకు రానుంది.
