5:00 PM | 18జూన్2026 ముఖ్యాంశాలు..
❇️ సింగరేణిలో ఇప్పటికీ బ్రిటీష్ పాలన కొనసాగుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రామగుండం ఓసీపీ-3 పర్యటనలో కార్మికులను వేధిస్తున్నారని, డిపెండెంట్ ఉద్యోగాలు, వైద్య పథకాల అమలులో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడతామని, గతంలో జరిగిన తప్పులకు క్షమాపణ చెబుతున్నామని తెలిపారు.
——————————————–
❇️ ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన అధికారులు, మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ కొనసాగిస్తున్నారు
———————————————–
❇️ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 254 పాయింట్లు పెరిగి 77,409 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు ఎగబాకి 24,168 వద్ద స్థిరపడ్డాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడం, చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటం మార్కెట్లకు ఊతమిచ్చాయి.
———————————————–
❇️ రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధిరలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధుల జమ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
————————————————–
❇️ జూన్ 21న జరిగే నీట్-యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.
—————————————————-
❇️ ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో భూమికి 32 మీటర్ల లోతులో నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో ఇది ఏకైక భూగర్భ స్టేషన్‌గా నిలవనుంది
—————————————————-
❇️ బరువు తగ్గిన తర్వాత ‘ట్రాన్స్‌జెండర్‌లా ఉన్నావు’ అంటూ వచ్చిన ట్రోల్స్‌పై ఆనందిత ఘాటుగా స్పందించారు. తాను ఓజెంపిక్ మందులు వాడలేదని, 2018 నుంచే ఫిట్‌నెస్ ప్రయాణం కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు
—————————————————-
❇️ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోషల్ ఫారెస్ట్రీ కార్యక్రమాల విస్తరణపై కీలక సూచనలు చేశారు.
—————————————————-
❇️ వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం ‘తెలంగాణ శ్రీరంగం’గా ప్రసిద్ధి చెందింది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మికత, శిల్పకళ, ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది.
—————————————————-
❇️ తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఒడిశాలో 80 కిలోమీటర్ల మేర వాహనాన్ని వెంబడించి 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.
—————————————————-
❇️ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన జోనాథన్ తాబేలును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్‌గా ప్రకటించింది. ఈ సెషెల్స్ జెయింట్ తాబేలు ప్రస్తుతం 194 ఏళ్ల వయసులో ఉంది.
—————————————————-
❇️ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశాలను పూర్తిగా డిజిటల్, పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లు అందజేశారు.
—————————————————-
❇️ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.
—————————————————-
❇️తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకుని 2027 ఐపీఎల్‌ను మార్చి 10 నుంచి మే 15 వరకు నిర్వహించే ప్రతిపాదనలను బీసీసీఐ పరిశీలిస్తోంది. మ్యాచ్‌ల సంఖ్య ప్రస్తుతం 74గానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
—————————————————-
❇️ రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనమహోత్సవం-2026ను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతోంది.
పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
