TGIIC | మూడు వారాల పాటు స్టే..

TGIIC | మూడు వారాల పాటు స్టే..

  • ఎస్‌బీఐ పిటిషన్‌పై కీలక ఉత్తర్వులు

TGIIC | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రాయదుర్గం సర్వే నంబర్‌ 83/1లో ఉన్న టీజీఐఐసీ (TGIIC) భూముల వేలం ప్రక్రియకు తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ భూముల వేలంపై మూడు వారాల పాటు స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈ భూములు తమకు సంబంధించినవని పేర్కొంటూ State Bank of India (ఎస్‌బీఐ) హైకోర్టును ఆశ్రయించింది. భూముల యాజమాన్య హక్కులపై వివాదం ఉన్న నేపథ్యంలో వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.

పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, తదుపరి విచారణ వరకు మూడు వారాల పాటు వేలం ప్రక్రియపై స్టే విధించింది. అలాగే ఈ వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ, టీజీఐఐసీ, గౌర వెంచర్స్‌కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వర్గాల్లో ప్రాధాన్యత ఉన్న ఈ భూముల అంశంపై హైకోర్టు నిర్ణయం ఆసక్తికరంగా మారింది. తదుపరి విచారణలో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.