రైతులకు యూరియా యాప్ సేవలపై అవగాహన

పరకాల, ఆంధ్రప్రభ: రైతులకు యూరియా యాప్ సేవలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.గురువారం పరకాల మండల రైతు వేదికలో వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల స్వచ్ఛంద సేవకులు, రైతులకు యూరియా యాప్ సేవలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శుక్రవారం నుంచి మండలంలో యూరియా యాప్ ద్వారా యూరియా విక్రయాలు ప్రారంభమవుతాయని తెలిపారు. రైతులకు అవసరమైన మేర యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

రైతులు తమ సాగు వివరాలను యాప్‌లో నమోదు చేసుకుని యూరియాను ముందస్తుగా బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛంద సేవకులు, రైతు వేదికల వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులు, సహకార సంఘాల వద్ద స్వచ్ఛంద సేవకులు అందుబాటులో ఉండి రైతులకు యూరియా కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తారని వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు.