4stars | మూవీ ఎవరితో…?

4stars | మూవీ ఎవరితో…?
Telugu Cinema | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. వరుసగా సక్సెస్ సాధించి.. సెన్సేషన్ క్రియేట్(Create a sensation) చేశారు. అయితే.. కూలీ సినిమా అంతకు మించి అనేట్టుగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని.. కోలీవుడ్ కు ఫస్ట్ 1000 కోట్లు మూవీగా నిలుస్తుందని సినీ జనాలు ఎదురు చూశారు. కానీ.. కూలీ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్(Coolie flopped at the box office) అయ్యింది. ఇక అప్పటి నుంచి లోకేష్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది సస్పెన్స్ గా మారింది. నలుగురు స్టార్ హీరోల పేర్లు తెర పైకి వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ స్టార్ హీరోతో లోకేష్ కు సీక్రెట్ మీటింగ్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. లోకేష్ ట్రై చేస్తున్న ఆ నలుగురు స్టార్స్ ఎవరు..? సీక్రెట్ మీటింగ్ ఎవరితో..?
4stars | ఖైదీ సీక్వెల్..

లోకేష్ కనకరాజ్.. కూలీ సినిమా తర్వాత.. సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్.. ఈ క్రేజీ కాంబోలో మూవీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే.. కూలీ సినిమా ప్లాప్ అవ్వడంతో.. రజినీకి లోకేష్ పై అంతగా నమ్మకం లేదని.. అందుకనే ఆ భారీ మల్టీస్టారర్ మూవీ(Multistarrer movie)ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వేరే దర్శకుడుకు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో లోకేష్ నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. ఖైదీ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్(Create a sensation) చేసిందో తెలిసిందే. కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమాకి సీక్వెల్ చేయాలని.. లోకేష్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ నెక్ట్స్ ఖైదీ సీక్వెల్ అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఆతర్వాత ఇది సెట్ కాలేదని టాక్ వినిపిస్తోంది.
4stars | అమీర్, లోకేష్ కాంబో..
ఈ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో భారీ చిత్రం చేయాలి అనుకున్నారు. కూలీ సినిమాలో అమీర్ గెస్ట్ రోల్ చేయడంతో.. ఈ కాంబోలో మూవీ పక్కా అంటూ(The movie is perfect) అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే.. కూలీ ప్లాప్ అవ్వడంతో.. ఈ క్రేజీ కాంబో మూవీ ఇక లేనట్టే అంటూ ప్రచారం ప్రారంభమైంది. ఇదే విషయం గురించి అమీర్ ఖాన్(Aamir Khan) ను బాలీవుడ్ మీడియా అడిగితే.. లోకేష్ కనకరాజ్ టచ్ లోనే ఉన్నారని.. త్వరలోనే వచ్చి ఫుల్ స్టోరీ నెరేట్ చేస్తాను అన్నారని.. చెప్పారు. దీంతో అమీర్, లోకేష్.. కాంబో మూవీ ఆగిపోలేదని.. ప్రాజెక్ట్ డిష్కసన్ లో ఉందనే క్లారిటీ వచ్చింది.

4stars | చైతూ – లోకేష్..

యువ సమ్రాట్ నాగచైతన్యతో.. లోకేష్ కనకరాజ్ మూవీ అంటూ ఇటీవల ఓ వార్త వైరల్ అయ్యింది. నాగచైతన్య ప్రస్తుతం.. వృషకర్మ అనే సినిమా చేస్తున్నారు. దీనిని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్(Huge budget of 100 crores) తో ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమా తర్వాత చైతూ సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు. లోకేష్ కనకరాజ్.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయాలి.. అలాగే చైతన్య(Chaitanya) కూడా ఈ బ్యానర్ లో సినిమా చేయాలి. అందుచేత ఈ ఇద్దరి కాంబోలో సినిమా సెట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపించింది.
4stars | బన్నీతో లోకేష్ సీక్రెట్ మీటింగ్..

లేటెస్ట్ గా లోకేష్ కనకరాజ్.. టాలీవుడ్ స్టార్ హీరోతో సీక్రెట్ మీటింగ్ ఉండడంతో హైదరాబాద్ వచ్చినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన లోకేష్ కనకరాజ్ వీడియోలు వైరల్(Lokesh Kanagaraj’s videos go viral) అవుతున్నాయి. ఇంతకీ.. లోకేష్ సీక్రెట్ మీటింగ్ ఎవరితో అంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అంటూ టాక్ వినిపిస్తోంది. బన్నీ.. ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్(Trivikram) తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీని తర్వాత లోకేష్ తో బన్నీ మూవీ ఫిక్స్ అని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరి.. లోకేష్ నెక్ట్స్ మూవీ ప్రచారంలో ఉన్నట్టుగా ఐకాన్ స్టార్(Icon Star) తోనే ఉంటుందా..? లేక వేరే స్టార్ హీరోతో ఉంటుందా..? అనేది తెలియాల్సివుంది.
