రెండేళ్ల పాలనలో కూటమి అభివృద్ధి, సంక్షేమం

  • ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళాలి
  • స్థానిక 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్

పాయకాపురం, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్ళాలని స్థానిక 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రెండేళ్ల నమ్మకం,సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకొని వెళ్లాలని అన్నారు.

ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి వింజమురి సతీష్, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. బాబు, కంకణాల బాబు,అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.