ఆల‌యంలో మంత్రి ఆనం పూజ‌లు

విజయనగరం, అక్టోబర్ 7 (ఆంధ్రప్రభ); ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లమ్మకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈమేరకు మంగళవారం విజ‌య‌న‌గ‌రం జిల్లా (Vijayanagaram District) కేంద్రానికి విచ్చేసిన ఆయ‌న దేవాలయాన్ని సంద‌ర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ లాంఛనాలతో మంత్రికి ఎదురేగి స్వాగతం పలికారు. హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) ఘటం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. మంత్రి ఆనంతో పాటే అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

Leave a Reply