11వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థి అస్గర్ అలీని గెలిపించండి

11వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థి అస్గర్ అలీని గెలిపించండి
- ఇంటింటి ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
- రైటప్:11వ వార్డులో బి ఆర్ ఎస్ అభ్యర్థి అస్గర్ అలీ కి మద్దతుగా ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అస్గర్ అలీని ఆశీర్వదించి అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా వార్డు పరిధిలోని ఆజాద్ నగర్ ,రెడ్డి నగర్ లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి అస్గర్ అలీని గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్లలో తాను చేపట్టిన అభివృద్ధి తప్ప రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదన్నారు .మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హడావిడిగా ఏదో చేస్తున్నావని చెప్పుకునేందుకు రోడ్డు పనులు ప్రారంభించడం తప్ప వాటికి అనుమతులు కూడా రాలేదన్నారు.
ఎలాంటి ప్రోస్టింగ్స్ లేకుండా అభివృద్ధి పనులు ప్రారంభించడం ప్రజలను ఎన్నికల సందర్భంగా మోసం చేయడమేనని మాజీ ఎమ్మెల్యే చిట్టెం ధ్వజమెత్తారు .అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఒకటి అమలు చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరోసారి ప్రజలను ఓటర్లను మోసం చేయడం లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మక్తల్ మున్సిపల్ అభివృద్ధికి గతంలో ఎమ్మెల్యే గా తాను పెద్ద ఎత్తున నిధులిచ్చి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు.
ఈ ఎన్నికల్లో 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న అస్గర్ అలీని ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్త,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నర్సింహా గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
