మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను..

మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను..

  • నన్ను ఆశీర్వదించండి..కౌన్సిలర్ గా గెలిపించండి..
  • ప్రచారానికి భారీగా తరలివచ్చిన ప్రజలు
  • నిన్నే గెలిపిస్తామంటూ ప్రజానీకం
    ఇండిపెండెంట్ అభ్యర్థి రాడపాక ఆరోగ్యం

స్టేషన్ ఘన్ పూర్ ఫిబ్రవరి5 ఆంధ్రప్రభ: స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు నుంచి ఇండి పెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న రాడపాక ఆరోగ్యం ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గురువారం నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు. కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యల ను అడిగి తెలుసుకున్న ఆరోగ్యం, వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా నని భరోసా ఇచ్చారు.

ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతగా పరిష్క రిస్తానని హామీ ఇచ్చారు. మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను..మీ ఆశీ ర్వాదంతో కౌన్సిలర్‌గా గెలిస్తే మాటలకే పరిమితం కాకుండా అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఆయన ప్రజలను ఆశీర్వాదం కోరారు. ప్రచారానికి తరలివచ్చిన ప్రజలు నిన్నే గెలిపిస్తామంటూ ధీమా వ్యక్తం చేయడంతో వాతావరణం ఉత్సాహంగా మారింది. ఈ కార్యక్రమంలో మాతంగి కుమార్, సింగపురం రవి, రాజారపు రవి, శేషి కుమార్, రంజిత్, నవీన్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply