డాక్టర్ సౌమ్యకు ఘన సన్మానం..

వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం లేకుండా శ్రద్ధగా సేవలందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడంలో కృషి చేస్తున్న రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సౌమ్యను తెలంగాణ అదనపు డీజీపీ డాక్టర్ స్వాతిల సన్మానించారు.

స్థానిక శ్రీ సాయి డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో, డీఎంహెచ్ఓ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, డీఎంహెచ్ఓ డాక్టర్ స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply