పేదలకు ఎంతో తోడ్పాటు
పేదలకు ఎంతో తోడ్పాటు
మార్కెట్ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ
వెల్దండ అక్టోబర్ 15 ( ఆంధ్రప్రభ) : సీఎం సహాయనిధి పేదలకు ఎంతో తోడ్పాటునిస్తుందని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ అన్నారు. వెల్దండ మండల సమీపంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన కనుక అలివేలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స అనంతరం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన రూ.30వేల చెక్కును కేశమల్ల కృష్ణ చేతుల మీదుగా బుధవారం బాధితురాలికి అందజేశారు. అనంతరం బాధితురాలు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జి.లక్ష్మారెడ్డి, ఎన్.శ్రీను, సుధాకర్ రెడ్డి, తిరుపతి నాయక్, శ్రీను నాయక్, జె.కొండల్, కే.మల్లేష్, బి.కృష్ణయ్య, కే.రాములు, టీ.కృష్ణయ్య, కే.బాలయ్య, ఎం.సైదులు, బి.రాములు, కే.జంగయ్య, ప్రవీణ్ నాయక్, సుధాకర్, కే అనిల్, ఎండీ.అజార్, నవీన్ నాయక్, వెంకటేష్, రమేష్, కే.శ్రీను, ప్రశాంత్, అరుణ్, జగన్, తరుణ్, విక్కీ, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
